ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రద్ధా దాస్ ఎప్పటినుంచో మనసులో ఉంచుకున్న ఒక సీక్రెట్ ని లీక్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో "అలలై చిట్టలలై" సాంగ్ వస్తుంటే శ్రద్దా వైట్ శారీలో అలా నడుచుకుంటూ స్టేజి మీదకు వచ్చింది. ప్రదీప్ ఆమె చేయి పట్టుకుని కాసేపు అలా నడిచాడు. " నేను ఎప్పటినుంచో ఒక విషయం చెపుదామనుకుంటున్నా..ఒక సీక్రెట్ విషయం ఏమిటి అంటే నాకు ప్రదీప్ మీద ఎప్పటినుంచో చిన్న క్రష్ ఉంది" అనేసరికి అందరూ షాకయ్యారు. ఇక శ్రద్ధా, ప్రదీప్ కలిసి "అలలై చిట్టలలై" సాంగ్ కి రొమాంటిక్ స్టెప్స్ వేసి అందరినీ మెస్మోరైజ్ చేశారు. ప్రదీప్ వైట్ కలర్ బెలూన్స్ తీసుకుని గాలిలోకి వదిలేయడం, శ్రద్ధా వాటిని శ్రద్దగా పట్టుకోవడం చూస్తుంటే ఇద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ ఏదో ఉన్నట్టుగానే అనిపిస్తోంది.
"చిన్న సీక్రెట్ క్రష్ అన్నావ్ కదా అది పెద్ద క్రష్ ఎప్పుడవుతుంది" అని శేఖర్ మాస్టర్ చాలా ఉత్సాహంతో అడిగేసరికి "తెలియదు నాకు..లెట్స్ సి" అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది శ్రద్దా.. ఆ ఆన్సర్ కి శేఖర్ మాష్టర్ గట్టిగా అరిచాడు. ఆ కేకకి ఆది ఎంట్రీ ఇచ్చి "అసలు మీ ఇంటరెస్ట్ ఏమిటి మాస్టర్ నాకు అర్ధం కావట్లేదు" అని అడిగేసరికి శేఖర్ మాస్టర్ నవ్వేసాడు. " మీ ఇద్దరి జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది., మరి ఇంకా మీ ఇష్టం" అని ప్రదీప్ ని శ్రద్ధాకు చెప్పేసరికి "మాస్టర్ ఏమిటి మీకేమన్నా ఒంట్లో బాగాలేదా" అని హైపర్ ఆది అడిగాడు దాంతో స్టేజి మొత్తం నవ్వేసింది. "ఇన్నాళ్లకు ప్రదీప్ అన్న పొలంలో మొలకలొచ్చాయి...శ్రద్దా వదిన తగ్గేదేలే" అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.